ఈగల్- మాస్ బీట్ తో ఆడు మచ్చా ఫుల్ సాంగ్ రిలీజ్

Aadu Macha Song From Eagle Movie

రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఈసారి మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే రవితేజ కు కూడా ఈమధ్య సరైన హిట్ అనేది రాలేదు. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా పొంగల్ రేసులో బరిలోకి రానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా..టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు ఈసినిమా నుండి పాటలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఆడు మచ్చా అంటూ వచ్చే ఈపాట ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పాట అయితే బాగుంది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈపాట మంచి బీట్ తో ఆకట్టుకుంటుంది. రవితేజ అయితే ఫుల్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్‌, గడ్డంతో ఫుల్ మాస్ గా పవర్ ఫుల్ లుక్ లో ఉన్నాడు.

కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =