హాయ్ నాన్న.. మనందరం తలెత్తుకొని గర్వంగా చెప్పగలిగే సినిమా – నేచురల్ స్టార్ నాని

Natural Star Nani Great Words About Hi Nanna Movie

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో ‘హాయ్ నాన్న’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‍గా నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాని ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “వైజాగ్ తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదు. నేను చేసిన యాక్షన్‌ చిత్రాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో బాగా ఆడాయి. ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు యూఎస్‌, హైదరాబాద్‌లాంటి యారియాల్లో బాగా ఆడాయి. అయితే జానర్ ఏదైనా అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడిన ప్రాంతం వైజాగ్‌. ఈ రకంగా వైజాగ్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. డిసెంబర్ 7న వైజాగ్ లో ప్రతి మూలనుంచి అందరూ థియేటర్స్‌కి వెళ్లి హాయ్ నాన్న చూడాలి. డిసెంబర్ నెల కొత్త సంక్రాంతి అని నా ఫీలింగ్. తెలియకుండా ఇది సినిమా పండగ నెల అయిపొయింది. ఇకపై డిసెంబర్, జనవరి రెండు నెలలు సినిమాలకి సెలబ్రేట్ చేసుకోవాలి” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “డిసెంబర్ 1న మన తెలుగు దర్శకుడు హిందీకి వెళ్లి తీసిన ‘యానిమల్’ సినిమా వస్తోంది, 8న నా స్నేహితుడు నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’తో వస్తున్నారు, 22న మనమందరం ఎదురుచూస్తున్న ప్రభాస్ అన్న ‘సలార్’ వస్తోంది, అలాగే నాకు ఇష్టమైన దర్శకుడు రాజు హిరాణీ గారి ‘డంకీ’ సినిమా 21 వస్తోంది, అలాగే 29న సుమ గారబ్బాయి ‘బబుల్‌గమ్’ సినిమా విడుదలౌతుంది. ఈ సినిమాలన్నీ కూడా గొప్ప బ్లాక్ బస్టర్ అయిపోయి ఇకపై డిసెంబర్, జనవరి నెలలు సినిమా పండగ నెలలుగా డిక్లేర్ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని సినిమాలు వున్నా సరే.. డిసెంబర్ 7న వస్తున్న ‘హాయ్ నాన్న’ ఎప్పటికీ మీ మనసులో నిలిచిపోతుందని పూర్తి నమ్మకంతో చెబుతున్నాను. విరాజ్, మహి, యష్ణ, జస్టిన్ ఈ టీం అందరూ కూడా మీ మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటారు” అని పేర్కొన్నారు.

అలాగే నాని ఇలా చెప్పారు..” ‘హాయ్ నాన్న’ హాయిగా ఉండబోయే సినిమా. నాని ఏడిపించేస్తాడు ఇదొక ఎమోషనల్ ఫిల్మ్ అనుకుంటున్నారు కదా.. కాదు.. మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఆనందంగా తిరుగుతాయి. ఆనందభాష్పాలు తెప్పించే సినిమా ఇది. థియేటర్‌కి వెళ్లి ఎలాంటి ఎడ్రినాలిన్ ఫీలవ్వలో అలాంటి ఎడ్రినాలిన్ మొదటి నుంచి చివరి వరకూ ఒక ప్రేమకథలో కుదిరితే ఎలా వుంటుందో అది హాయ్ నాన్నలో చూస్తారు. దర్శకుడు శౌర్యువ్ మొదటి సినిమా ఇది. ఇంత గొప్ప అవుట్ ఇచ్చిన శౌర్యని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత తను మరింత గొప్ప స్థాయికి వెళ్తారనే నమ్మకం వుంది. మా నిర్మాతలు మోహన్, విజయేందర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి ప్రొడక్షన్‌లో చేసే మొదటి సినిమా చాలా గొప్ప సినిమా అవ్వాలని బలంగా కోరుకుని ఈ ప్రాజెక్ట్‌ని చేశాను. ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నందుకు ఇంకా గర్వంగా ఫీలౌతున్నా” అని చెప్పారు.

“హేషమ్ వహాబ్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు. షాన్ జాన్ వర్గీస్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. మా ఎడిటర్ ఇంత గొప్ప కావ్యాన్ని అన్ని హైస్ తో రెండున్నర గంటల్లో అద్భుతంగా నెరేట్ చేయగలిగారు. మా ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ కి, మా టీం అందరినీ పేరుపేరున ధన్యవాదాలు. మనందరం తలఎత్తుకొని చాలా గర్వంగా చెప్పగలిగే సినిమా చేశాం. ప్రియదర్శి హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటించారు. మనసుని హత్తుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విరాజ్, జయరామ్ గారు కూడా చాలా చక్కని పాత్రల్లో నటించారు. బేబీ కియరా నటన మీ అందరిని అలరిస్తుంది. అలాగే శ్రుతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. మీరంతా ఆ పాటని చాలా ఎంజాయ్ చేస్తారు. వీటితో పాటు బోలెడన్ని సర్ప్రైజ్ లు సినిమాలో వున్నాయి. డిసెంబర్ 7న సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు. డిసెంబర్ 7.. థియేటర్స్‌లో కలుద్దాం. హాయ్ నాన్న వెరీ వెరీ మెమరబుల్ ఫిల్మ్. ప్రామిస్’’ అని నాని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =