అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా – హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Reveals Interesting Facts About Hi Nanna in Pre Release Event

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో ‘హాయ్ నాన్న’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‍గా నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “సీతారామంకు ఇక్కడి వచ్చాను, ఇప్పుడు హాయ్ నాన్న కోసం ఇక్కడికి రావడం ఆనందంగా వుంది. సీత పాత్రని చాలా గొప్పగా ఆదరించారు. ఇప్పుడు హాయ్ నాన్నలో యష్ణ కు కూడా అదే అభిమానం చుపిస్తున్నారు. తెలుగు అమ్మాయిలా నన్ను ఆదరిస్తున్న మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో వుంటాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. హాయ్ నాన్న బ్యూటీఫుల్ జర్నీ. దర్శకుడు శౌర్యువ్ హాయ్ నాన్నని అద్భుతంగా మలిచారు. బేబీ కీయరా నటన మనసుని హత్తుకుంటుంది” అని తెలిపారు.

ఇంకా మృణాల్ ఇలా అన్నారు.. “నాని గారు వండర్ ఫుల్ కో స్టార్. ఈ పాత్ర చేస్తునప్పుడు చాలా విలువైన సూచనలు ఇచ్చారు. చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. దర్శి, విరాజ్ ఇలా టీం అందరితో షూటింగ్ చాలా సరదాగా జరిగింది. హేషమ్ వహాబ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సమయమా, అమ్మాడి పాటలు నా ఫేవరేట్. ఇందులో తండ్రికూతురు అనుబంధం అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా చూస్తునపుడు వారితో ప్రేమలో పడిపోతారు. అలా జరగకపొతే నా పేరు మార్చుకుంటా. డిసెంబర్ 7న తప్పకుండా అందరూ హాయ్ నాన్న చూడండి’’ అని అన్నారు .

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − thirteen =