విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. నిజానికి ఈసినిమాను మే3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈనేపథ్యంలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కొత్త రిలీజ్ డేట్ ను మే10వ తేదీకి మార్చారు.
𝗥𝗘𝗩𝗘𝗡𝗚𝗘 𝗜𝗦 𝗗𝗘𝗟𝗔𝗬𝗘𝗗, 𝗕𝗨𝗧 𝗡𝗘𝗩𝗘𝗥 𝗗𝗘𝗡𝗜𝗘𝗗 🔥
The tale of fury unleashes on the big screens on May 10th ⚔️
⭐️ing @ActorSatyaDev #Krishnamma GRAND RELEASE ON 𝐌𝐀𝐘 𝟏𝟎𝐭𝐡💥
Grand Release by @MythriOfficial & @Primeshowtweets ✨#VVGopalakrishna pic.twitter.com/yu1SYwNXD8
— ArunachalaCOffl (@ArunachalaCOffl) April 26, 2024
ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: