ప్రస్తుతం తెలుగులో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్-నాగార్జన కాంబినేషన్ లో వస్తున్న కుబేర. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ అయితే ట్రెమెండెస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. అంతేకాదు ఎలాంటి గ్యాప్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా గత కొద్ది రోజులుగా బ్యాంకాక్ లో కీలక షెడ్యూల్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు బ్యాంకాక్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కొత్త షెడ్యూల్ ను ముంబైలో స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఇక్కడ కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలియచేశారు.
A THUNDERING EXPERIENCE in progress ⏳@sekharkammula‘s #Kubera New schedule kicks off in Mumbai 💥
Some interesting moments in this schedule are going to catch your eye balls ❤️🔥@dhanushkraja @iamnagarjuna @iamRashmika @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation… pic.twitter.com/AP0fCrpOkO
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 25, 2024
కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: