సలార్ మేకర్స్ ఫ్రీ టికెట్ ఆఫర్

salaar movie makers offers free tickets

ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
మరోవైపు అందరూ ఎదురుచూస్తుంది ఈసినిమా ట్రైలర్ కోసం. రేపు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే తాజాగా ఒక అప్ డేట్ తో వచ్చారు. ఈసినిమా ఫ్రీ టికెట్ కోసం ఒక ఆఫర్ తో వచ్చేశారు. మేకర్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రశాంత్ నీల్ ఇంకా ప్రభాస్ ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇక ఆ ఫొటోకు బెస్ట్ క్యాప్షన్ ఇవ్వమని అడిగారు. బెస్ట్ క్యాప్షన్ ఇచ్చిన ఐదుగురికి తమ సమీప థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ ఇస్తామని తెలిపారు.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =