సినిమా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. హీరో నాని

Hero Nani Reveals Interesting Facts About Hi Nanna Movie

సినిమా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా.. డిసెంబర్ 7న ప్రేక్షకులందరూ నాన్న ప్రేమలో పడిపోవడం ఖాయం అని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన శుక్రవారం (నవంబర్ 24, 2023) తాను కథానాయకుడిగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చుసుకున్నపుడు ‘వీడెవడో బావున్నాడు’ అని అనిపించింది ‘హాయ్ నాన్న’ సినిమాకే (నవ్వుతూ). శౌర్యువ్ రాసుకున్న కథలో సాన్ జాన్ చూపించిన విజివల్స్ వల్ల నేను చాలా బావుంటాను. టీజర్ పాటలు ఇప్పుడు ట్రైలర్ చూశారు. కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత వుంది. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం. సినిమా అనేది నాకు ఆక్సిజన్ తో సమానం. సినిమా అనేది నిజంగా నా ఊపిరి. ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా… డిసెంబర్ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ భాద్యత నాది, మా టీం అందరిది. బాక్సాఫీసు బాధ్యత మీది. ప్రామిస్. అందరికీ పేరుపేరునా లవ్ యూ సో మచ్’’ అన్నారు.

కాగా నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పని కోరుతుంది. అతను ప్రతిదీ వివరిస్తాడు కానీ ఆమె తల్లి గురించి ఏదో దాచిపెడతాడు. కథలో చాలా ఎమోషన్ ఉంది, దీంతో పాప తన తల్లి గురించి తండ్రిని ఇబ్బందిపెట్టాలని అనుకోదు. కథలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పాప కొత్త స్నేహితురాలు యష్నా (మృణాల్)ని తన తల్లిగా ఊహించుకుంటుంది. అయితే శృతి హాసన్, విరాజ్ భార్యగా, మహి తల్లిగా రివీల్ అవుతుంది. ట్రైల‌ర్ ముందుకు వెళుతున్న కొద్దీ క‌థ‌లో చాలా లేయ‌ర్లు ఆసక్తిగా తెరపైకి వస్తాయి. ముఖ్యంగా తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రతిఒక్కరినీ హత్తుకునేలా ఉంది.

దర్శకుడు శౌర్యువ్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ని అద్భుతంగా మలిచాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు భిన్నంగా కథను చాలా కొత్త తరహాలో ప్రజెంట్ చేశాడు. ఈ ప్రేమ కథలో ఒక మ్యాజిక్ ఉంది. ‘దసరా’లో మాస్ క్యారెక్టర్ తర్వాత నాని పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించడం కొత్తగా వుంది. తండ్రిగా, ప్రేమికుడుగా వైవిధ్యమైన పాత్రలో అద్భుతంగా నటించారు నాని. తన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. మృణాల్ ఠాకూర్ మనసుని ఆకట్టుకునే నటన కనబరిచింది. అలాగే బేబీ కియారా ఖన్నా చాలా క్యూట్ గా మనసుల్ని దోచేసింది.

రొమాంటిక్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ ఎపిసోడ్స్ , ప్రతి ఫ్రేం లో టాప్-నాచ్ కెమెరా యాంగిల్స్‌, లైటింగ్‌ తో సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్‌ ప్రేక్షకులని కట్టిపడేశారు. గోవా, కూనూర్ మొదలైన అద్భుతమైన లొకేషన్‌లు చాలా బ్యూటీఫుల్ గా చిత్రీకరించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్లాస్‌తో పాటు ఎమోషనల్ కనెక్షన్‌ని అద్భుతంగా జోడిస్తుంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా సతీష్‌ ఈవీవీ, ఎడిటర్‌గా ప్రవీణ్‌ ఆంథోని వ్యవహరిస్తున్నారు. ‘హాయ్ నాన్న’ తప్పకుండా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని అనిపిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 12 =