హనుమాన్ వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

hanuman movie worldwide premiere release date fixed

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రశాంత్ మేకింగ్, తేజ నటన, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి బ్లాక్ బస్టర్ ను అందించాయి.ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా  రికార్డుల మోత మోగించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పుడు టెలివిజన్ లోకి కూడా రాబోతుంది. ఈమేరకు ఈసినిమా వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగులో ఈసినిమా రానుంది. మరి అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సత్తా చాటుతున్న హనుమాన్ మూవీ టెలివిజన్ లో ఎలాంటి రికార్డ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమా ప్రీ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో కూడా తేజ సజ్జానే హీరోగా నటిస్తుండగా.. భారీ తారాగణాన్నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =