కాంతార ప్రీక్వెల్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

kantara movie prequel first look release date time fixed

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈసినిమాను తెరకెక్కించారు. కన్నడలో చిన్నగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. దీంతో గీతా ఆర్ట్స్ వారు ఈసినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్ ను అందించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికలపై సైతం ప్రశంసలను దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాకు ప్రీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ఆధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ ను నవంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు నటించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫి, ప్రతీక్ శెట్టి ఈసినిమాకు ఎడిటర్ గా పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =