100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్

HanuMan Prasanth Varma-Teja Sajja' Film Successfully Completed 100 Days

టాలీవుడ్ యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘హనుమాన్’. యువ నటుడు తేజ సజ్జా హీరోగా నటించగా శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 350 కోట్లుకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అయింది. అనంతరం ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ ‘జీ5’లో మార్చి 17 నుంచి తెలుగులోకి రాగా.. జియో సినిమాలో హనుమాన్ హిందీ వెర్షన్ మార్చి 16 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. కాగా థియేటర్లలో రిలీజైన 66 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి రావడం విశేషం. నేటితో ఈ చిత్రం 100 రోజులను పూర్తి చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో ఒక సినిమా.. అందులోను తెలుగు చిత్రం 100 రోజులు థియేటర్లలో ఆడటం అద్భుతమైన విషయం.

ఇక హనుమాన్ సినిమా విడుద‌లై 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎక్స్ లో స్పెషల్ పోస్ట్ చేసిన ఆయన అందులో.. “ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయం అపారమైన కృతజ్ఞతతో నిండి ఉంది. థియేటర్లలో హనుమంతుని 100 రోజుల వేడుకను నేను జీవితాంతం ఆదరించే క్షణం. హనుమంతుడిని సొంతం చేసుకున్నందుకు మరియు ఇటీవలి సంవత్సరాలలో చాలా అరుదుగా ఉన్న థియేటర్లలో 100 రోజుల రన్ మైలురాయిని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.. మీడియా మిత్రులకు మరియు నా టీమ్ మొత్తానికి ఎల్లవేళలా అపారమైన మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

కాగా హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్స్ వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ప్రకటించారు. దీనికి ‘జై హనుమాన్’ అనే టైటిల్ పెడుతున్నట్లు హనుమాన్ ఎండింగ్‌లోనే స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =