ఈ పాటకు రోషన్‌తో కలిసి స్టెప్స్ వేయాలనిపించింది – మెగాస్టార్ చిరంజీవి

Mega Star Chiranjeevi Launches Izzat Song From Bubble Gum Movie

సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ లీల’ చిత్రాలకు మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. మానస చౌదరి కథానాయికగా నటించగా.. హర్ష, కిరణ్‌ మచ్చ, అనన్య ఆకుల, అను హాసన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రబృందం. దీనిలో భాగంగా కొన్నిరోజుల క్రితం ‘బబుల్‍గమ్’ సినిమా టీజర్ రిలీజవగా మంచి స్పందన రాబట్టుకుంది. అలాగే నేచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇజ్జత్‌’ అనే గీతాన్ని విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజైన ఈ ర్యాప్ సాంగ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందించగా.. ఎంఎస్‌ హరి సాహిత్యాన్ని సమకూర్చడంతో పాటు హీరో రోషన్‌ కనకాలతో కలిసి ఈ పాటను ఆలపించారు.

ఇక ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘బబుల్‌గమ్‌ ట్రైలర్‌ చూశాను. చాలా బాగా నచ్చింది. ‘ఇజ్జత్‌’ సాంగ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. శ్రీ చరణ్‌ హుషారైన బాణీ అందించారు. పాట వింటుంటే.. రోషన్‌తో కలిసి నాకు కూడా స్టెప్స్ వేయాలనిపించింది. రాబోయే రోజుల్లో ఈ సాంగ్ అన్ని పబ్బుల్లో, క్లబ్బుల్లో మరియు ప్రతి ఫంక్షన్ లో మారుమోగిపోతుంది. ఇక హీరోయిన్ మానస చాలా బాగా చేసింది. తాను తెలుగమ్మాయి అవడం అభినందించదగ్గ విషయం. రాజీవ్, సుమ దంపతులు ఆనందపడే క్షణాలు, తల్లిదండ్రులుగా గర్వపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 14 =