ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ – తేజా సజ్జా

Teja Sajja Thanks To Audience as HanuMan Completes 100 Days

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో తేజా సజ్జా మాట్లాడుతూ.. సత్యం థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్ లో హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది. ‘ఈ జనరేషన్ లో వంద రోజులు వున్నది నీకే’ అని ఒకరు మెసేజ్ చేశారు. నిజానికి ఇది నా వంద రోజులు కాదు మీ అందరి వంద రోజులు” అని చెప్పారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్. సముద్రఖని గారు మా సినిమాలోకి వచ్చి సినిమా స్థాయిని పెంచారు. నిర్మాత నిరంజన్ గారు చాలా గట్స్ వున్న ప్రొడ్యూసర్. గట్స్ వున్న వాళ్ళకే హిట్స్. అలాంటి గట్స్ వున్న నిరంజన్ గారికి హనుమాన్ మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిరంజన్ గారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రేక్షకులకు పాదాభివందనాలు. ఈ విజయానికి కారణం ప్రేక్షకులే. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని తేజా సజ్జా తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =