బిగ్ బాస్ 7.. ప్రస్తుతం హౌస్ లో గత కొద్దిరోజులుగా ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. టాప్ 10 లో ఎవరి ర్యాంకింగ్ ఎంతో చెప్పి తోటి కంటెస్టెంట్ లను ఒప్పించి ఆ నంబర్ దగ్గర నిల్చోవాలని బిగ్ బాస్ చెప్పగా శివాజీ ఫస్ట్, ప్రశాంత్ సెకండ్, యావర్ మూడు, ప్రియాంక నాలుగు, శోభా 5, అమర్ ఆరు, గౌతమ్ 7, అర్జున్ 8, అశ్విని 9, రతకి పది స్థానాల్లో నిలబడతారు. అయితే వీరిలో చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికి ఎవిక్షన్ పాస్ టెస్ట్ పెడతాడు బిగ్ బాస్. ఇక ఆ టాస్క్ లో మొదట అర్జున్ గెలుస్తాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అర్జున్ గెలిచినా కూడా మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈసారి టాప్ 5 కంటెస్టెంట్ లతో టాస్క్ లు ఆడాలని చెబుతాడు. అలా మొదట బ్యాలన్స్ టాస్క్ పెట్టగా అందులో అర్జున్, యావర్ ఇద్దరూ తలపడతారు. ఇక ఆ గేమ్ లో యావర్ గెలుస్తాడు. ఆతరువాత బిగ్ బాస్ యావర్ కు మరిన్ని టాస్క్ లు ఇచ్చాడు. మొదట మోటర్ బైక్ నెంబర్స్ గేమ్ ను ఇస్తాడు.. ఈ గేమ్ లో స్క్రీన్ పై వచ్చే నెంబర్ ను గుర్తుంచుకొని దాన్ని బైక్ కు పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ కోసం యావర్ ప్రశాంత్ ను సెలక్ట్ చేసుకుంటాడు. అయితే యావరే గేమ్ లో విన్ అవుతాడు.
ఆ తరువాత ఫుడ్ టాస్క్ ఇస్తాడు.. ఐ లవ్ బర్గర్ అనే టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ లో ఆరు బర్గర్ లు తీనాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ కోసం శోభా శెట్టిని సెలక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్ లో కూడా యావరే గెలుస్తాడు. అనంతరం టేక్ ఏ బౌ అనే గేమ్ పెట్టాడు. ఈ గేమ్ లో యావర్ ప్రియాంక, శివాజీ ఇద్దరితో తలపడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ప్రియాంక బాల్స్ ముందు కింద పడిపోవడంతో టాస్క్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత శివాజీ బాల్స్ పడిపోవడంతో ఈ టాస్క్ లో కూడా యావర్ గెలుస్తాడు. అయితే ఈ టాస్క్ లో శివాజీ ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.. గేమ్ సరిగా ఆడండి అంటూ పదే పదే చెబుతుండటం వల్ల డిస్టబ్ అయ్యానని చెప్పాడు. దీంతో ప్రశాంత్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేశాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: