టాలీవుడ్ గాయనీమణుల్లో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకోగలిగిన అతికొద్దిమందిలో సింగర్ సునీత ఉపద్రష్ట ఒకరు. కేవలం గాయకురాలిగానే కాకుండా.. ఎన్నో సినిమాల్లో కథానాయికలకు తన గాత్రాన్ని అరువిచ్చారు. ఒక గాయకురాలిగా సునీతను మూవీ లవర్స్ ఎంతగా అభిమానిస్తారో.. సినిమాల్లో ఆమె చెప్పే డబ్బింగ్ ని కూడా అంతే అభిమానిస్తారు. ఇక సునీత డబ్బింగ్ కి సాధారణ ప్రేక్షకులే కాదు, పేరొందిన డైరెక్టర్స్ సైతం ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. దీనికితోడు దేశ, విదేశాల్లో కొన్ని వేల షోలు చేసిన అనుభవం ఆమె సొంతం. కాగా తన సుదీర్ఘ కెరీర్ లో కొన్ని వేల పాటలను ఆలపించిన సింగర్ సునీత.. తన సమ్మోహన గాత్రంతో సంగీత ప్రియులను విశేషంగా అలరించారు. అయితే నిజ జీవితంలో ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆమె తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచారు. వృత్తిపరంగా ఎందరో వర్ధమాన గాయనీమణులకు స్ఫూర్తిగా నిలిచిన ఆమె.. వ్యక్తిగతంగానూ మరెంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా, ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సింగర్ సునీత మాట్లాడుతూ.. “నేను 17 ఏళ్లకే సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. మా నాన్న గారు వ్యాపారంలో నష్టపోయిన నేపథ్యంలో మా కుటుంబ బాధ్యతలను నేను తీసుకున్నాను. వివిధ కారణాల వలన 19 ఏళ్లకే మ్యారేజ్ అయింది. ఈ క్రమంలో 21 ఏళ్లకే ఆకాశ్ పుట్టాడు. ఒక తల్లిగా ఆ క్షణాలను ఎంతో ఆస్వాదించాను. అనంతరం 24 ఏళ్ల వయసులో శ్రేయ పుట్టింది. దీంతో ఒకవైపు పిల్లలను చూసుకుంటూ.. మరోవైపు సినిమాల్లో పాటలు పాడుతూ ఎంతో బిజీగా గడిపాను. ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి 35 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ కష్టపడుతూనే ఉన్నాను. అయితే ఈ సమయం ఎలా గడిచిందో కూడా ఇప్పుడు గుర్తు లేదు” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “నా జీవితంలో చాలాసార్లు నా పక్కనున్నవారే నన్ను మోసం చేశారు. కానీ పరిస్థితులను అర్ధం చేసుకుని ధైర్యంగా ముందడుగు వేసేదాన్ని. అసలు మన వ్యక్తిగత జీవితం గురించి రికార్డింగ్ స్టూడియోలో చర్చించాల్సిన అవసరం లేదు. వృత్తి జీవితం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. గుడికి వెళ్లినప్పుడు చెప్పులు బయటే వదిలేసి ఎలాగైతే లోపలికి వెళ్తామో.. అలాగే పర్సనల్ లైఫ్ విషయాలను స్టూడియో బయటే వదిలేసి ప్రొఫెషనల్ లైఫ్ లోకి వెళ్లాలి” అని పేర్కొన్నారు. ఇక చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి రావడం వలన ఎవరితో ఎలా మెలగాలో అర్ధం కావడానికి కొన్నేళ్లు పట్టింది. ఈ కాలంలో ఎన్నో అవకాశాలను కోల్పోయాను. కానీ నాపై ఎన్నో రకాల విమర్శలు చేసినవారున్నారు” అని తెలిపారు.
“నేను చాలా సెన్సిటివ్. ప్రతిదానికీ కన్నీళ్లు పెట్టుకుంటా. అయితే ఏదైనా విషయానికి స్పందించలేకపోతే నేను అర్టిస్ట్‌ను ఎలా అవుతాను?. ఇక నా నవ్వు చాలా ఫేక్‌గా ఉంటుందని చాలామంది కామెంట్ చేశారు. ఎప్పుడైనా నా గురించి కొన్ని విషయాలు ఎదుటివారికి చెప్పడం ఇష్టం లేనప్పుడు అలా నవ్వి వదిలేస్తాను. దానిని చూసి ఫేక్ స్మైల్ అనుకున్నవారున్నారు.. అలాగే ఆ నవ్వులో బాధను గుర్తించినవారూ ఉన్నారు. కానీ నేనేంటో నాకు బాగా తెలుసు. నా వరకు ప్రకృతే దేవుడు. అయితే అన్నిటికన్నా నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం రెండో పెళ్లి చేసుకోవడం. దీనివలన ప్రస్తుతం జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను ” అని సింగర్ సునీత పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: