జయం రవి సైరెన్ మూవీ టీజర్ రిలీజ్

jayam ravi siren movie telugu teaser out now

తమిళ్ స్టార్ హీరో జయం రవి సినిమాకు తెలుగులో కూడా మంచి ఆదరణే ఉంది. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ దగ్గర నుండి ప్రీఫేస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కీర్తి సురేష్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగిన ఈ టీజ‌ర్‌లో జయం రవి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా కనిపించాడు. జ‌యం ర‌వి జైలు నుంచి విడుద‌లైన అనంత‌రం త‌న ప్రతీకారం తీర్చుకునేందుకు చూస్తున్నట్లుగా ఉంది. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా కీర్తి సురేష్ నటించనుంది. అనుపమా పరమేశ్వరన్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుంది. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =