అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రిలీజ్

allari naresh aa okkati adakku movie trailer out now

కామెడీ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ఇక ఈమధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ సినిమాలు తీసినా ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్ లోకి వచ్చేశాడు. మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని అమీర్ పేట్ లోని ఏఏఏ సినిమాస్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని అతిథిగా విచ్చేశారు. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న హీరోకి ఒక మ్యాచ్ కూడా సెట్ అవ్వకపోతే.. అతని జీవితం ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనేది ఈసినిమా కథగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకా యాక్షన్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా నరేష్ మార్క్ కామెడీ తో యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − sixteen =