NBK109 షూట్ లో జాయిన్ అయిన హంటర్

bobby deol joins for NBK 109 movie shoot

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో బాబి డియోల్ కూడా ఒక కీలక పాత్రలో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈసినిమా షూటింగ్ లో బాబి డియోల్ జాయిన్ అయినట్టు తెలిపారు. ది హంటర్ ఎంటర్స్.. మీ స్క్రీన్ ప్రెజన్స్ మా సినిమాను మరింత స్పెషల్ చేయనుందని చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు.

కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వాన్ని వహించిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఇప్పుడు బాలయ్య సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 7 =