టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆయన.. తాజాగా మరో ఘనత సాధించారు. సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’లో తారక్ స్థానం సంపాదించారు. ఈ మేరకు విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్’లో ఎన్టీఆర్‌కు సభ్యత్వం అందిస్తున్నట్లు వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ కోసం అకాడమీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి నటులను స్వాగతించింది. ఈ నేపథ్యంలో గురువారం (అక్టోబర్ 19, 2023) అకాడమీ తన కొత్త మెంబర్స్ యాక్టర్స్ లిస్ట్‌ని అనౌన్స్ చేసింది. ఈ ఏడాది సభ్యులుగా చేరిన ఐదుగురు నటుల పేర్లను వెల్లడించింది. ఈ క్రమంలో వారిలో ఎన్టీఆర్‌కు స్థానం కల్పిస్తూ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. జూ. ఎన్టీఆర్‌తో పాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ తదితరులకు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. ఇక ఈ జాబితాలో స్థానం సంపాదించి ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ప్రవేశించడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా జూ. ఎన్టీఆర్ అరుదైన గుర్తింపు సాధించారు.
International recognition for the great actor👌@TheAcademy honors Man of Masses @tarak9999 by selecting him as a member of the Actors Branch!!🙏#JrNTR #RRRMovie #Devara #TeluguFilmNagar pic.twitter.com/GV1ezmA2vR
— Telugu FilmNagar (@telugufilmnagar) October 19, 2023
View this post on Instagram
ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం దక్కాలంటే.. నటీనటులకు ఈ అర్హతలు ఉండాలి –
అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వానికి ఆహ్వానం అందుకోవాలంటే.. కొన్ని ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఒక నటి లేదా నటుడు తన జీవిత కాలంలో కనీసం మూడు థియేట్రికల్ ఫీచర్ ఫిల్మ్స్‌లో నటించి ఉండాలి. అలాగే ఆయా సినిమాల్లో ఒకటి గత ఐదు సంవత్సరాల్లోపుగా ఖచ్చితంగా విడుదలై ఉండాలి.. దీనితోపాటుగా ఆ చిత్రం ప్రధానంగా అకాడమీ సూచించిన విధంగా ఉన్నత ప్రమాణాలను కలిగి ఉండాలి. లేదా యాక్టింగ్ కేటగిరీ కింద అకాడమీ అవార్డుకు నామినేట్ అయి ఉండాలి. లేదా.. యాక్టర్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ ఆమోదించడం ద్వారా కానీ, ప్రత్యేక ప్రతిభతో గుర్తింపును పొంది కానీ, లేదంటే, చలన చిత్ర నటుడిగా అత్యుత్తమ సహకారాన్ని అందించడంలో కానీ కీలక పాత్ర పోషించి ఉండాలి. ఈ విధంగా ఇన్ని అర్హతలు కలిగిన సినిమాల్లో అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు మాత్రమే ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’లో చోటు కల్పిస్తారు. అలాంటి అరుదైన గుర్తింపునకు ఇప్పుడు జూ. ఎన్టీఆర్ ఎంపిక కావడం విశేషం.
కాగా ఇటీవలే దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 వేడుకల్లో భాగంగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ప్రదర్శించిన అద్భుత నటనకుగానూ ఆయన ఈ అవార్డ్ అందుకున్నారు. అలాగే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ కూడా గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’తో పాటుగా ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డ్స్ లోనూ సత్తా చాటింది. అంతకుముందు ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’తో పాటుగా ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డ్స్ లోనూ సత్తా చాటింది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఈ తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.
అయితే ఇదిలా ఉంటే.. తమ అభిమాన హీరో ఈ గౌరవాన్ని అందుకోవడంపై తారక్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని అద్భుత నటనకుగానూ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే దర్శకుడు రాజమౌళి కూడా అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా జూనియర్‌ను ఆకాశానికెత్తేశారు. ముఖ్యంగా ‘కొమురం భీముడో’ పాటలో తారక్‌ను మ్యాచ్ చేయగల నటుడు ఇండియాలోనే లేడని కితాబిచ్చారు. ఎన్టీఆర్ కనుబొమ్మలతో కూడా నటించగల సత్తా ఉన్నవాడని ఓ రేంజ్‌లో పొగిడారు. ఇక తాజాగా తమ హీరోకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: