భగవంత్ కేసరి రివ్యూ- ఫీల్ గుడ్ యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

balakrishna bhagavanth kesari telugu movie review

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమా భగవంత్ కేసరి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. దానికితోడు టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది అనే విషయం తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. బాలకృష్ణ, కాజల్, శ్రీలల, అర్జున్ రాంపాల్ తదితరులు
దర్శకత్వం.. అనిల్ రావిపూడి
బ్యానర్స్.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌
నిర్మాతలు..పై సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్
సంగీతం.. ఎస్ థమన్

కథ
నేలకొండ భగవంత్ కేసరి (నందమూరి బాలకృష్ణ) చేయని తప్పుకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అయితే జైలులో ఖైదీగా ఉన్న భగవంత్ కేసరికి అక్కడ పనిచేసే జైలర్ హెల్ప్ చేస్తాడు. దానితో జైలర్ ను సస్పెండ్ చేస్తారు పై అధికారులు. ఇక తను వెళ్లేముందు సత్ప్రవర్తన కారణంగా భగవంత్ కేసరి ని రిలీజ్ చేసి వెళతాడు. జైలు నుండి వెళ్లిన భగవంత్ కేసరి విజ్జి(శ్రీలీల) ను పెంచే బాధ్యతను తీసుకుంటాడు. ఆర్మీలో జాయిన్ చేయిచాలని చూస్తాడు. కానీ విజ్జి కి మాత్రం అది ఇష్టం ఉండదు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటుంది. .మరోవైపు దేశంలో ఉన్న పోర్టులు అన్నీ కలిపే ప్రాజెక్ట్ వి దక్కించుకోవాలని రాహుల్ సంఘ్వి (అర్జున్ రాంపాల్) కల. కొన్ని పరిస్థితుల కారణంగా రాహుల్ సంఘ్వి దారిలోకి విజ్జీ వస్తుంది. ఇంతకీ విజ్జి ఎవరు? బాలకృష్ణ విజ్జిని పెంచే బాధ్యతను ఎందుకు తీసుకుంటాడు? అసలు బాలకృష్ణ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? రాహుల్ సంఘ్వి- బాలకృష్ణ కు మధ్య ఉన్న వైరం ఏంటి? అనేది మిగిలిన కథ

విశ్లేషణ
అనిల్ రావిపూడి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ ఎంటర్ టైనర్లకు కాస్త కమర్షియల్ ఎలిమంట్స్ ను జోడించి సినిమాలు తీస్తుంటాడు. ఇక ఈఫార్ములా బాగానే వర్కవుట్ అయింది. అందుకే ఇప్పటివరకూ విజయాలే అందుకున్నాడు. అయితే ఈసారి బాలకృష్ణతో సినిమా తీశాడు. ఒకరకంగా ఈసినిమా అటు బాలకృష్ణ కూ అలానే అనిల్ రావిపూడికి ఇద్దరికీ ఒక టెస్ట్ లాంటిదే. ఎందుకంటే బాలకృష్ణ అఖండ, అంతకు ముందు సినిమాలు ఒకేలా ఉంటూ వస్తున్నాయి. మరోవైపు అనిల్ కూడా ఒకే ట్రాక్ లో వెళుతున్నాడు. దీంతో ఇద్దరూ ఈసినిమాతో చేంజ్ ఓవర్ అవ్వడానికి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి కూడా దానికి తగ్గట్టే కథను సిద్దం చేసుకొని భగవంత్ కేసరితో వచ్చాడు.

ఇక ఈసినిమాలో తన మార్క్ రైటింగ్ ను చూపిస్తూనే బాలకృష్ణ ను కూడా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. ఫస్టాఫ్ ఇంట్రడక్షన్ ఇంకా శ్రీలీల‌ను ల‌క్ష్యం దిశ‌గా న‌డిపించేందుకు బాల‌య్య చేసే ప్ర‌య‌త్నాలు ఆ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు.. మరోవైపు కాజ‌ల్‌తో ఫ‌న్నీ ల‌వ్ ఎపిసోడ్ ట్రాక్‌ ఇలా సాగిపోతాయి. సెకండాఫ్ కాస్త సీరియస్ మోడ్ లోకి వెళుతుంది. విలన్ ఎంట్రీ, ఫ్లాష్ బాక్, ట్విస్ట్ లు ఉత్కంఠంగా ఉంటాయి. సెకండ్ ఆఫ్ అటు యాక్షన్ తో ఇటు సెంటిమెంట్ తో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు సాలిడ్ క్లైమాక్స్ లతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పరుగులు పెడుతుంది. మరోవైపు బాలకృష్ణ సినిమా అంటే ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా కొన్ని అంశాలను ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. అనిల్ రావిపూడి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కు హై ఇచ్చే కొన్ని ఎలిమెంట్స్ ను జోడించాడు. బాలకృష్ణ టీ వేడి చేసే సీన్.. బస్, టన్నెల్ సీన్ ఇలా కొన్ని సీన్లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

నిజానికి ఇలాంటి కథలు కొత్తేం కాదు. గతంలో ఇలాంటి కథలు చాలానే చూశాం. విలన్ కారణంగా ఊరికి దూరమైన హీరో తన బతుకు తాను బతకడం, అతని జీవితంలోకి మళ్లీ విలన్ రావడం.. మళ్లీ హీరో-విలన్ మధ్య పోరాటం ఇదే కథ. అయితే ఈ కథను ప్రారంభం నుండి ఎంగేజ్ చేయడంలో అనిల్ సక్సెస్ అయ్యాడు. అంతేకాదు అనిల్ రావిపూడి ఈసినిమాతో మహిళలకు కూడా మరో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. మహిళా సాధికారికత ఇంకా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా గుడ్ టచ్ ఇంకా బ్యాడ్ టచ్ కు మధ్య డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలనే సందేశం కూడా ఇచ్చాడు.

పెర్ఫామెన్స్
బాలకృష్ణ సినిమా అంటే దాదాపు బాలయ్య వన్ మ్యాన్ షోనే. మరోసారి తన నటనతో అదరగొట్టాడు. అయితే గత సినిమాల్లో కంటే కాస్త డిఫరెంట్ గా కనిపించాడు బాలకృష్ణ. బాల‌య్య అంటే సాధారణంగా యాక్ష‌న్‌, డైలాగులు అనుకుంటా.. కాని ఈసినిమాలో స‌రికొత్త కామెడీతో పాటు ఎమోష‌న‌ల్‌ సన్నివేశాల్లో న‌డివ‌య‌స్సులో బాధ్య‌త క‌ల వ్య‌క్తిగా అద్భుత‌మైన న‌ట‌న క‌న‌పరిచాడు. బాలకృష్ణ తరువాత ఈసినిమాలో మరో ప్రధాన బాలమైన పాత్రలో నటించింది శ్రీలీల. ఒక రకంగా ఇది పాత్ర ప్రధానమైన రోల్ అని చెప్పొచ్చు. ముందు కాస్త చిలిపిగా అల్లరి చేసే పిల్లగా ఆ తరువాత బాలకృష్ణపై కోప్పడే అమ్మాయిగా.. ఆ తరువాత తండ్రి లక్ష్యాన్ని అర్థం చేసుకున్న యువతిగా చాలా బాగా చేసింది. కాజల్ కూాడా తన పాత్రలో బాగా నటించింది. కామెడీ సన్నివేశాల్లో బాగా చేసింది. విలన్ గా చేసిన అర్జున్ రాంపాల్ కూడా తన పాత్ర మేర బాగా నటించాడు. ఇక సుబ్బారాజు తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు

టెక్నికల్ వాల్యూస్
ఈసినిమాకు సంగీతం థమన్ అందించాడన్న సంగతి తెలిసిందే. మరి బాలకృష్ణ సినిమాకు థమన్ సంగీతం అంటే అంచనాలు ఏరేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాకు ఓ రేంజ్ లో మ్యూజిక్ అందించడంతో ఈసినిమాపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. దానికి తగ్గట్టే ఈసినిమాకు కూడా మంచి మ్యూజిక్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవల్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో థమన్ అదరగొట్టాడు. వెంక‌ట్ యాక్ష‌న్ అదిరిపోయింది. ఇక సినిమాటోగ్రఫి గురించి కూడా ప్రత్యేకంగా చెపుకోవాలి. అందించిన విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా అనిల్ రావిపూడి గత సినిమాకంటే భిన్నమైన సినిమా అని చెప్పొచ్చు. యాక్షన్ తో పాటు ఎమోషన్ ల్ కంటెంట్ కూడా ఉండటంతో ఈసినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందని చెప్పొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 3 =