ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు శౌర్యాంగ పర్వంగా సలార్ 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అదేంటంటే ఈసినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఒక స్పెషల్ సాంగ్ కూడా చేస్తుంది అన్నారు. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. కియారా అద్వాని ఈసినిమాలో నటించడంలేదని.. స్పెషల్ సాంగ్ కూడా చేయట్లేదని సలార్ 2 మూవీ టీమ్ కియారాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని శ్రుతి హాసన్యే హీరోయిన్ అంటూ మూవీ టీమ్ తెలిపింది.
కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబి సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. . హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: