మళ్లీ షూటింగ్ షురూ చేసిన మనోజ్

manchu manoj back to set for What The Fish Movie shoot

మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తను మళ్లీ సినిమాలతో బిజీ అయినప్పుడే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇక రీసెంట్ గానే పేరెంట్స్ కూడా అయ్యారు. భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ ను స్టార్ట్ చేశాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చాడు. మళ్లీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. తన ట్విట్టర్ ద్వారా మిరాయ్ సెట్ నుండి ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ నాకు ఎంతో ఇష్టమైన పన చేయడానికి మళ్లీ సెట్ లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈసినిమాను 6ix సినిమాస్ ఇంకా afilmbyv బ్యానర్స్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 5 =