వచ్చే నెలలో హైప్ వున్న సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే అది విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరే. ఇప్పుటికే రిలీజ్ అయిన రెండు పాటలు చార్ట్ బాస్టర్ కావడం దానికితోడు విశ్వక్ వరుస హిట్ల తో ఫుల్ ఫామ్ లో వుండడం తో ఈసినిమా పై మంచి అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా టీజర్ ను ఈనెల 27నవిడుదలచేయనున్నారు.ఈ సందర్భంగా టీజర్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ ఈవెంట్ శనివారం సాయంత్రం 04:01 గంటలకు ప్రారంభం కానుంది.సినిమాకు బజ్ పెరగాలంటే టీజర్ ను బాగా కట్ చేయాలి.మరి ఈటీజర్ అంచనాలను తగట్లు ఉంటుందో లేదో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Rage of our Lankala Rathna 🔥🌊
Mass Ka Das @VishwakSenActor‘s #GangsOfGodavari Teaser Launch Event on 27th April @ 04:01 PM! 💥💥
Worldwide grand release at theatres near you on MAY 17th! #GOGOnMay17th ❤️🔥 pic.twitter.com/R6BuRcY5qC
— Sithara Entertainments (@SitharaEnts) April 24, 2024
కృష్ణ చైతన్య డైరెక్షన్ లో గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూరల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి కీలక పాత్రలో కనిపించనుంది.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ , శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.మే 17న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఈసినిమా కాకుండా విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో మెకానిక్ రాకీ ఒకటికాగా ఇంకోటి లైలా.ఈసినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నాడు.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయనుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.త్వరలోనే లైలా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: