పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈసినిమా వీడి13 అనే వర్కింగ్ టైటిల్ తో నే షూటింగ్ ను జరుపుకుంటుండగా తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
In every family – there is A Hero!
This one is for all of you ❤️Sankranti 2024#FamilyStar
Telugu: https://t.co/s4umaa21jd
Tamil: https://t.co/RBmY1pxL9N pic.twitter.com/1zba1s18fS
— Vijay Deverakonda (@TheDeverakonda) October 18, 2023
కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా రోజులైపోయింది. లైగర్ తరువాత ఖుషితో వచ్చాడు.. ఈసినిమా మిక్డ్స్ ఫలితాలను అందించింది. ఈసినిమాతో అయినా విజయ్ సాలిడ్ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: