హనుమాన్ టీమ్ కు గవర్నర్ సత్కారం

prasanth varma and teja sajja meet telangana governor c p radhakrishnan

హనుమాన్ సినిమాకు మాత్రం ఇప్పటికీ ఏదో ఒకరకంగా గౌరవమర్యాదలు దక్కుతూనే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జాహీరోగా వచ్చిన ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్నసినిమాగా వచ్చిన ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా రిలీజ్ అయి రీసెంట్ గానే 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ వందరోజుల్లో ఈసినిమా ఎన్నో అవార్డులను, రివార్డులను, సత్కారాలను అదుకుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది ఈటీమ్ కు. ఈసినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ గవర్నర్ శ్రీ సీపీఆర్ గౌ గారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాను తమ కార్యాలయానికి ఆహ్వానించి వారిని సత్కరించారు. టీమ్ కు బెస్ట్ విషెస్ ను అందించారు.

ఈసినిమా ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఇప్పుడు టెలివిజన్ లోకి కూడా రాబోతుంది. ఈమేరకు ఈసినిమా వరల్డ్ వైడ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగులో ఈసినిమా రానుంది.

ఇప్పుడు జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమా ప్రీ లుక్ ను కూాడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో కూడా తేజ సజ్జానే హీరోగా నటిస్తుండగా.. భారీ తారాగణాన్నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని ఐమ్యాక్స్ 3డీ వర్షన్ లో కూడా రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =