ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 వేడుకలు దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుకల్లో సెప్టెంబర్ 15న తొలిరోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీలోని పలువురు తారలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ అవార్డుల విజేతలను పబ్లిక్ పోలింగ్ ద్వారా నిర్ణయించగా.. అదే సమయంలో, ఆయా విభాగాలకు సంబంధించి నామినీలను మాత్రం జ్యూరీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఆయన ప్రదర్శించిన నటనకుగానూ ఆయన ఈ అవార్డ్ అందుకున్నారు. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ధమాకా చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకుంది.
ఉత్తమ నటుడి కేటగిరీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అడివి శేష్, దుల్కర్ సల్మాన్, నిఖిల్, సిద్ధూ జొన్నలగడ్డ పోటీ పడగా.. ఉత్తమ నటి కేటగిరిలో మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి, సమంత, నిత్యామీనన్, నేహాశెట్టి, శ్రీలీల పోటీ పడ్డారు. అలాగే ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి అవార్డ్ అందుకోగా.. ఉత్తమ సహాయ నటుడిగా ‘భీమ్లా నాయక్’ సినిమాకి రానా, మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ చిత్రం తరపున ఉత్తమ పరిచయ నటిగా అందుకున్నారు. కాగా ఈరోజు తమిళ, మలయాళం పరిశ్రమలకు చెందిన చిత్రాలకు సంబంధించి అవార్డులు ప్రకటించనున్నారు.
సైమా అవార్డ్స్ 2023 తెలుగు విజేతలు వీరే..
- ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
- ఉత్తమ చిత్రం: సీతారామం
- ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
- ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
- ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
- ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
- సెన్సేషన్‌ఆఫ్ ది ఇయర్ : నిఖిల్, కార్తికేయ2
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (నాటు నాటు సాంగ్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
- ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (జింతక్ సాంగ్)
- ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
- ప్రామిసింగ్ న్యూకమ్ యాక్టర్: బెల్లంకొండ గణేష్
- ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: