స్వాగ్ డబ్బింగ్ మొదలుపెట్టిన రీతూవర్మ

ritu varma starts her dubbing for swag movie

వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది సామజవరగమన సినిమాతో అలరించగా ఈఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ జోష్ తోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు చేతిలో పలు సినిమాలు ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఈసినిమా వస్తుంది.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చింది హీరోయిన్ గా నటిస్తున్న రీతూవర్మ. ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మరి ఈసినిమాలో రీతూవర్మ వింజమర వంశంలోని మహారాణి రుక్మిణిదేవిగా నటించనుంది.

కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈసినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వేదరామన్‌ శంకరన్‌ పనిచేస్తుండగా.. సంగీతం వివేక్‌ సాగర్‌ అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.