యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టి రిలీజ్ కు సిద్దం చేశారు కూడా. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ఇప్పటివరకూ ప్రకటించలేదు చిత్రయూనిట్. ఇప్పుడు చాలా రోజుల తరువాత ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నవంబర్ 3న ‘కీడా కోలా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు.. ప్రధాన తారాగణం అంతా సీరియస్ లుక్స్ లో కనిపించడం ఆసక్తికరంగా వుంది.
Osthunaam 😎 #KeedaaCola at your nearest theatres! Nov 3rd Ki theatres lo kaludhaam 🪳#KeedaaColaOnNov3rd@TharunBhasckerD @VGSainma @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns pic.twitter.com/7m4rLFPivB
— Rana Daggubati (@RanaDaggubati) September 15, 2023
కాగా విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.