టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి, ‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు నటించగా.. రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్ టాక్‌తో విడుదలైన అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కాసులు కురిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ (అమెరికా)లో డాలర్ల వర్షం కురిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.3 కోట్ల వరకూ షేర్ ను అందుకోగా.. యూఎస్‌లో 193కే డాలర్లను రాబట్టుకొని అక్కడ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ యూఎస్‌లో ($1.4K+) రూ.11కోట్ల 63 లక్షలకి పైగా రాబట్టి.. 2 మిలియన్ డాలర్స్ దిశగా పరుగులు తీస్తోంది. ఈ మేరకు యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేసిన ప్రత్యంగిర డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా ఈ సినిమాను హీరో నవీన్ పొలిశెట్టి యూఎస్‌లో కూడా గట్టిగానే ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నం ఇప్పుడు డాలర్ల రూపంలో ఫలితాన్నిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దీనికితోడు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ షో చూశాక సినిమా అద్భుతంగా ఉందంటూ రివ్యూ ఇవ్వగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా సినిమాను ప్రశంసిస్తూ ఒపీనియన్ ఇవ్వడం కూడా యూఎస్‌లో చిత్రం వసూళ్లపై మంచి ప్రభావం చూపిందని వారు అంటున్నారు.
#MissShettyMrPolishetty marches past $1.4 Million+ in the USA!
Racing towards $2 Million
Catch the biggest entertainer of the year on the big screen now!
USA Release by @PrathyangiraUS
#MSMP @NaveenPolishety @MsAnushkaShetty @UV_Creations pic.twitter.com/aLrn8QW4OK
— Suresh PRO (@SureshPRO_) September 16, 2023
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రేమ, పెళ్లిపై సదుద్దేశం లేని అన్విత (అనుష్క) పరిస్థితుల ప్రభావంగా ఒక బిడ్డకి తల్లి కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో సిద్దూ(నవీన్ పోలిశెట్టి)ని చూస్తుంది. తన బిడ్డకు తండ్రిగా సిద్దూ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించి అతనితో సన్నిహితంగా ఉంటుంది. అలాగే తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా తెలుసుకుంటుంది. అయితే మరోవైపు ఇవన్నీ చూసిన సిద్దూ.. అన్విత తనను ప్రేమిస్తుందనుకుని ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ అన్విత పెళ్లి వద్దని, అయితే అతని సహకారంతో తల్లి కావాలనుకుంటున్నానని అసలు విషయం సిద్దూకి చెబుతుంది. దీంతో సిద్దూ ఏం నిర్ణయించుకుంటాడు? అన్విత ప్రపోజల్ కు ఒప్పుకుంటాడా? లేక ప్రేమ అంటే నమ్మకంలేని.. అన్వితనే సిద్దూ ప్రేమలో పడుతుందా? అనేది మిగిలిన కథ. ప్రస్తుత జెనరేషన్ వారికి బాగా కనెక్ట్ అయ్యే కథ కావడంతో సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























