మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు. చాలా రోజుల తరువాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. మే 3వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూాడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. అంతేకాదు డీసెంట్ రన్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకుంది. 2 గంటల 14 నిమిషాల నిడివి ఖరారు అయ్యింది. మరి సినిమాకు అల్లరి నరేష్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.
The content is locked 🔒
and the entertainment is crystal clear ✅The perfect summer bonanza #AaOkkatiAdakku receives a U/A certification ❤️
An ultimate fun experience awaits on May 3rd 💥#AOAonMay3rd @allarinaresh @fariaabdullah2 #VennelaKishore @harshachemudu… pic.twitter.com/i33DSOYJ5x
— Chilaka Productions (@chilakaprod) April 29, 2024
కాగా ఈసినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా హర్ష చెముడు, అరియానా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























