నటుడిగా నాకు స్ఫూర్తి హీరో రవితేజ – కార్తీక్ రత్నం

Karthik Rathnam Interesting Comments on Hero Ravi Teja

సినిమాలపై ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త నటులందరికీ హీరోలు రవితేజ, నానిలే ఇన్స్పిరేషన్ అని, అలాగే తనకు కూడా నటుడిగా స్ఫూర్తి రవితేజ అని పేర్కొన్నాడు యువ నటుడు కార్తీక్ రత్నం. కేరాఫ్‌ కంచర్లపాలెం, నారప్ప చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. ఈ సినిమాకి నిర్మాత హీరో రవితేజ కావడం విశేషం. ఈనెల 15న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో కార్తీక్ రత్నం విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ కెరీర్ మరియు ‘ఛాంగురే బంగారురాజా’కి సంబంధించి పలు విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తీక్ రత్నం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “నేను చిన్నప్పట్నుంచీ రవితేజ వీరాభిమానిని. ఆయనతో ఒక్క ఫొటో దిగినా చాలు అనుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆయన నిర్మించిన సినిమాలో హీరోగా చేయడం నిజంగా కలలా ఉంది. నేను రంగస్థల నటుడ్ని. పదేళ్ల వయసులోనే ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నాను. హీరోగా ఎదగాలనేది కాదు, నటుడిగా ఎదగాలనేదే నా లక్ష్యం. అందుకే నచ్చితే ఎలాంటి పాత్రనయినా చేస్తాను. అయితే ఇంతకుముందు నేను చేసినవన్నీ సీరియస్‌ మోడ్‌ తరహా పాత్రలే. ఈ సినిమాలో తొలిసారి హ్యూమర్‌తో కూడిన పాత్ర చేశాను. ఇది నాకో కొత్త అనుభవం” అని పేర్కొన్నాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ కథలోని ప్రతి పాత్రకూ ఓ మేనరిజం ఉంటుంది. అందులోంచే అద్భుతమైన కామెడీ పుడుతుంది. కథ ప్రకారం.. సినిమాలో నేను మెకానిక్‌గా కనిపిస్తా. మా సినిమా నిర్మాత, హీరో రవితేజ గారు సినిమా చూశారు. ఆయనకి బాగా నచ్చింది. అంత పెద్ద హీరో నా నటన గురించి మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ‘ఛాంగురే బంగారురాజా’ పెద్ద హిట్‌ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. ఇక నా తదుపరి సినిమాల విషయానికొస్తే ‘శ్రీరంగనీతులు’ అనే సినిమా చేశాను. అది కూడా త్వరలో విడుదల కానుంది. అలాగే ప్రకాష్ రాజ్, ఏఎల్ విజయ్ కలిసి నిర్మించిన బై లింగ్యువల్ మూవీలో కూడా నటిస్తున్నాను. మిగిలిన సినిమాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తా” అని కార్తీక్ రత్నం తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here