ఒకప్పటి టాలీవుడ్ ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్, నేటి యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘హనుమాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తెలుగులో మొట్టమొదటి జాంబీ జోనర్‌గా చిత్రంగా తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ తర్వాత మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందంటూ పలువురు నెటిజెన్స్ కితాబునివ్వడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. మరో 5 రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న క్రమంలో.. అదేరోజు నుంచి ‘హనుమాన్’ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. కాగా ఈ చిత్రం ‘అంజనాద్రి’ అనే ఫిక్షన్ ప్లేస్ నేపథ్యంలో సాగనుంది. హనుమంతుని వర ప్రభావంతో అద్భుత శక్తులను పొందిన కథానాయకుడు (తేజ సజ్జా).. అంజనాద్రి కోసం ఎలా పోరాడాడనేదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. సూపర్ పవర్స్ కలిగిన హీరో అనేది యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం ఉంది.
#HanuMan movie promotions will start from this #GaneshChaturthi 🙏🏽😊#Sankranthi2024
— Prasanth Varma (@PrasanthVarma) September 13, 2023
చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హనుమాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శివేంద్ర పనిచేయగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. వచ్చే యేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, కొరియన్, చైనీస్, స్పానిష్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: