రౌడీహీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ కు ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే విజయ్ తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ తరువాత సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ స్పై గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కాగా ఈసినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ– ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలు రావడానికి గల కారణం.. ఒక పని మీద హైద్రాబాద్ రావడం. హైద్రాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండను కలిశారని..ఇద్దరి మధ్యా కథా చర్చలు జరిగాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు దీనిపై ప్రశాంత్ నీల్ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఇదంతా అసత్య ప్రచారమేనని చెప్పింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: