మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా ఈరోజు రాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లోకి రానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈసినిమా ను తెలుగు తోపాటు తమిళ ,మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఇక మహాశివరాత్రిన థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పర్వాలేదనిపించింది. గోపిచంద్ నుండి వచ్చిన రీసెంట్ సినిమాల కన్నా భీమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. అయితే గోపిచంద్ కు కావాల్సిన విజయాన్ని మాత్రం అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడ డైరెక్టర్ హర్ష డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లు గా నటించగా రవి బస్రుర్ సంగీతం అందించాడు.శ్రీసత్య సాయిఆర్ట్స్ బ్యానర్ ఫై కె కె రాధామోహన్ ఈసినిమాను నిర్మించాడు.
ఇక గోపిచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల తో విశ్వం అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను కూడా వదిలారు.శ్రీను వైట్ల మార్క్ కామెడీ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా చైతన్య భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.ఈసినిమా విజయం శ్రీనువైట్ల కు గోపిచంద్ కు కీలకం కానుంది.గోపిచంద్ కెరీర్ లో చాలా సినిమాలు రెండు అక్షరాల టైటిల్ తోనే వచ్చాయి.అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాయి.మరి విశ్వంకు కూడా ఆ సెంటిమెంట్ కలిసొస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: