నిన్న నామినేషన్ ప్రక్రియ చాలా వేడిగా ప్రారంభమైంది. ఒక కంటెస్టెంట్ వచ్చి నిలబడితే ఆ కంటెస్టెంట్ ను ఎంత మంది అయినా నామినేట్ చేసుకోవచ్చనే బంపరాఫర్ ను బిగ్ బాస్ ఇవ్వడంతో ఇదే ఛాన్స్ దొరకడంతో హౌస్ మేట్స్ ఎవరి మీద కోపంతో ఉన్నారో వారందరినీ నామినేట్ చేసేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నామినేషన్ లిస్ట్
ఇక ప్రశాంత్ నామినేషన్ దగ్గర ఎపినోడ్ పూర్తవ్వగా నిన్న ఎపిసోడ్ అక్కడినుండే మొదలుపెట్టారు. ముందు ప్రశాంత్ ను తేజ, ప్రియాంక, గౌతమ్, షకీలా, దామిని, అమర్ దీప్ నామినేట్ చేయగా వారితో పాటు రతిక, శోభాశెట్టి, శుభశ్రీ కూడా వచ్చి జాయిన అయ్యారు. అందరూ తనలో ఒరిజినాలిటీ లేదన్న పాయింట్ మీదే నామినేట్ చేసారు. ఆ తరువాత గౌతమ్ రాగా గౌతమ్ ను ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రియాంక చెప్పిన రీజనే నువ్వు చెబుతున్నావు అంటూ శోభా శెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. షకీలాను ప్రిన్స్ నామినేట్ చేశాడు. శుభశ్రీ, ప్రియాంకను ఎవరూ నామినేట్ చేయలేదు. తర్వాత వచ్చిన రతికను గౌతమ్, తేజ నామినేట్ చేశారు. ఇక గౌతమ్, రతిక మధ్య పెద్ద గొడవే జరిగింది. అమర్ దీప్ ను ప్రిన్స్, శివాజీ నామినేట్ చేశారు. దీంతో ఈవారం నామినేషన్స్ లిస్ట్ లోకి శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్ దీప్, షకీలా, గౌతమ్, శోభ, ప్రిన్స్ నిలిచారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే పవరాస్త్రను సొంతం చేసుకొని ఆట సందీప్ పర్మినెంట్ ఇంటి సభ్యుడు అవ్వగా ఇప్పుడు మిగిలిన కంటెస్టెంట్ లు కూడా ఇంటిసభ్యులు గా మారడానికి రెండో వారంలో మరో టాస్క్ తో వచ్చేశాడు. ఇంటి సభ్యులుగా మారేందుకు కంటెస్టెంట్ల మధ్య మాయాస్త్ర అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక టాస్క్ గురించి పెద్ద కథనే చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ అంటూ మొదలుపెట్టి.. మంచి వైపున ఉండే మాయా జీవుల దగ్గర ఉండే మాయను సొంతం చేసుకోవడానికి చెడు ప్రయత్నం చేస్తుందని..అది జరగకూడదనే మాయ జీవులు ఆమాయను ఒక ఆస్త్రంలో బంధించారు.. ఆ దాచిపెట్టిన చోటే ఇప్పుడు ఉన్న బిగ్ బాస్ హోస్ అంటూ తెలిపాడు.
మహాబలిVsరణధీర
ఇక టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేసి వారికి మహాబలి, రణధీర అనే పేర్లను పెట్టాడు. ఇక మొదటి ఇంటి సభ్యుడైన సందీప్ ఈ టాస్క్ కు సంచాలకుడిగా నియమించాడు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉండగా.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు.
పుల్ రాజా పుల్
మాయస్త్ర లో భాగంగా బిగ్ బాస్ పుల్ రాజా పుల్ అనే టాస్క్ ను ఇవ్వగా ఈ టాస్క్ లో రెండు టీమ్స్ నుండి నలుగురు సభ్యులు వచ్చి పాల్గొనాల్సి ఉంటుంది. మూడు రౌండ్లలో ఎవరు గెలిస్తే వారికి మయాస్త్రకు సంబంధించిన కీ దొరుకుతుంది. ఈ టాస్క్ లో రణధీర టీమే గెలిచి కీ ను సొంతం చేసుకుంటుంది. మరోవైపు కీ ను దొంగతనం చేయాలని మహాబలి టీమ్ ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇది గమనించిన రణధీర టీమ్ వారి ప్రయత్నాలను విఫయత్నంచేస్తుంది.
మరి ఈవారం ఎవరు ఇంటి సభ్యులుగా గెలుపొందుతారో తెలియాలంటే నెక్ట్స్ టాస్క్ ల వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.