ఈమధ్య వర్కింగ్ టైటిల్స్ తోనే సినిమాలు షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. షూటింగ్ సగం అయిన తరువాత లేదా ఇక ఏదైనా స్పెషల్ డేస్ కు టైటిల్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న టైటిల్ లో ఏమాత్రం మార్పు లేదు అంటున్నారు మేకర్స్. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా టైటిల్ అదే ఉంటుందా?లేదా మారుతుందా అన్న డౌట్ అయితే ఉంది. అయితే ఇప్పుడు టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ఈసినిమా టైటిల్ ను మార్చొదంటూ మేకర్స్ ను ట్యాగ్ చేశాడు. ఇక దీనికి స్పందించిన మేకర్స్.. ఏం లేదు.. ఇదే టైటిల్ అంటూ స్పష్టం చేశారు. మరి దీంతో టైటిల్ లో ఎలాంటి మార్పు లేదు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది.
Em ledu. Idhe. #TheyCallHimOG 🤙🏻
— DVV Entertainment (@DVVMovies) August 3, 2023
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: