మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్. త్వరలో విడుదల కానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ చిత్రంలో మెగాస్టార్‌తో కలిసి ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో సుశాంత్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ.. ”నా జీవితంలో ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరోగా కానీ.. గెస్ట్ రోల్ లేదా సపోర్టింగ్ రోల్ ఇలా ఏదైనా నా వద్దకు వచ్చిన పాత్రలు చేస్తున్నాను. ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ తో కలిసి నటించాను. అయితే బన్నీకి కూడా చిరంజీవి గారే స్ఫూర్తి. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ గారు నన్ను కొత్తగా చూపించారు. అలాగే రవితేజతో కలిసి చేసిన ‘రావణాసుర’ సినిమాలో కూడా నన్ను డిఫరెంట్‌గా చూపించారు” అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా సుశాంత్ ఇలా అన్నారు.. “తాజాగా ‘భోళా శంకర్’లో మెగాస్టార్ చిరంజీవి గారితో పని చేసే అవకాశం లభించింది. మరీ ముఖ్యంగా ఆయనతో చేయబోతున్నాననే ఆలోచనే చాలా ఎక్జయిటింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఈ జెనరేషన్ నటులు అందరూ చిన్నప్పటినుంచి చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగాం. నాకు ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. టీవీలో ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. నా చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్‌కి రెండు మూడుసార్లు వెళ్లాను కూడా. అందుకే దర్శకుడు మెహర్ రమేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పినప్పుడే చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ వుండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. మెగాస్టార్‌తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. అలాంటిది ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది?” అని అన్నారు.
“ఇది చిరంజీవి, కీర్తి సురేష్ మధ్య బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా వుండే మూవీ. ఇందులో నాది క్యామియో రోల్ అయినా కూడా నా పాత్ర చాలా ఛార్మింగ్ గా వుంటుంది. మెగాస్టార్, కీర్తి సురేష్, తమన్నాతో నాకు కీలకమైన సన్నివేశాలు వుంటాయి. ఈ సినిమా షూటింగ్‌ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్‌గా చేశాం. కీర్తి సురేష్ గారితో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిరంజీవి గారితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎక్సయిమెంట్ అనిపించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే..? సెట్స్ లో అందరు నటులతో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్‌లో ఉంచడం చిరంజీవి గారిలోని ప్రత్యేకత. ఈ సినిమాలో ఆయన టాక్సీడ్రైవర్‌గా పాత్రలో వుండగా ఒక సీన్ చేశాం. అందులో నేను పాసింజర్‌ని. ఆయన డోర్ తీస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. అందుకే నేనే డోర్ తీసుకుని బయటికి వచ్చాను. అయితే ఆయన మాత్రం ‘ఇందులో నీ గౌరవం కనిపించిపోతుంది. నేనే తీయాలి’ అని చాలా వివరంగా చెప్పారు. అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత నేను ఒక కంఫర్ట్ ఫుల్ జోన్ లోకి వచ్చాను” అని సుశాంత్ వెల్లడించారు.
కాగా టాలీవుడ్ స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్స్ తమన్నా భాటియా మరియు కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు విశేష ఆదరణ లభించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన ‘భోళా శంకర్’ ట్రైలర్ లో చిరంజీవి చెప్పిన డైలాగులు బాగా పేలాయి. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’ మూవీకి రీమేక్‌గా ఇది తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి సంబంధించిన షూట్ ఎప్పుడో పూర్తవగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: