పుష్ప పాటకు స్టెప్పులేసిన దేవిశ్రీ, ర‌ణ్‌వీర్ సింగ్.. వీడియో వైరల్

Ranveer Singh and Devi Sri Prasad Dances To Allu Arjun's Pushpa Song

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీతో ఒక్కసారిగా బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఇక ఈ చిత్రంలోని నటనకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం కైవసం చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకున్నారు. ఆయన అందించిన పాటలు ఈ మూవీ స‌క్సెస్‌లో కీ రోల్ పోషించగా, అన్ని భాషల సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ చిత్రంలోని పాటకు బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ స్టెప్పులేశారు. ఈ చిత్రంలోని ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా’ సాంగ్‌కు ర‌ణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ చేశారు. కాగా ఇటీవలే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‍లో భాగంగా ఈ పాటకు రణ్‍వీర్ సింగ్, దేవిశ్రీ ప్రసాద్ డ్యాన్స్‌ చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను దేవిశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప చిత్రం దాదాపు రూ.350 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 చిత్రం విడుదల కానుంది. తొలిభాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక రణ్‍వీర్ సింగ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం అయన అజయ్ దేవ్‍గన్, అక్షయ్ కుమార్‌తో కలిసి మల్టీస్టారర్ యాక్షన్ చిత్రం ‘సింగం అగైన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.