ఒకవైపు డైరెక్టర్ గా మరోవైపు నటుడిగా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు సముద్రఖని. రీసెంట్ గానే బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన లో వచ్చిన బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సముద్రఖని పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో గేమ్ ఛేంజర్ అనే సినిమా కూడా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సముద్రఖని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్రఖని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తనకు క్లోజ్ బాండింగ్ ఏర్పడిందని.. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మా బాండింగ్ మరింత పెరిగింది. రామ్ చరణ్ నాకు ఇప్పుడు సొంత కొడుకు లాంటి వాటు అంటూ తెలిపాడు.
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కియారా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: