ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీస్టార్

vijay devarakonda family star movie got super response in OTT

ఒక్కోసారి ఎంతో ఎక్స్ పేక్టేషన్స్ తో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. అయితే కొన్ని సినిమాలు థియేటరల్లో ఫెయిల్ అయినా కొంతకాలం తరువాత ఆడియన్స్ కు ఎక్కుతుంటాయి. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి వస్తుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. పరుశురాం దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ ఈసినిమా ఓటీటీ లో మాత్రం అదరగొడుతుంది. రీసెంట్ గానే ఈసినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఓటీటీ లో మాత్రం ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఓటీటీలో ఈసినిమాను చూసి పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయడం విశేషం. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ వాళ్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ ఫర్ ఫార్మెన్స్ బాగుందని, హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటూ వారు పోస్ట్స్ చేస్తున్నారు.

దీంతో ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ ను చూసి కావాలనే ఈసినిమాపై దుష్ప్రచారం చేశారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మించాారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =