గం గం గణేశా రిలీజ్ డేట్ అప్ డేట్

gam gam ganesha movie release date update

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. తన సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. అంతేకాదు ఆనంద్ నటనకు కూడా ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోయింది. అయితే చాలా రోజుల తరువాత ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచసి మే 31వ తేదీన ఈసినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో ఇంకా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హై లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =