హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

hari hara veera mallu movie teaser release date fixed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయిన సంగతి తెలిసిందే కదా. అయితే మేకర్స్ మాత్రం పవర్ స్టార్ లేని పోర్షన్స్ మాత్రం కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటున్నారు. అందులో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈసినిమా మాత్రం గత రెండేళ్లుగా ప్రేక్షకుల ముందుకు రాకుండా ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అప్ డేట్ కూడా వచ్చి చాలా రోజులైపోయింది. కానీ ఈసినిమా నుండి అప్ డేట్ వస్తుందని ఈరోజు ఉదయం మేకర్స్ ట్విట్టర్ ద్వారా సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఏం అప్ డేట్ వస్తుందా అని ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ ఎగ్జైటింగ్ అప్ డేట్ రానే వచ్చింది. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మే2వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో బాబి డియోల్ కూడా నటిస్తున్నాడు. ఔరంగజేబు పాత్రలో ఆయన నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా నోరా ఫతేహి యువరాణిగా, ఔరంగజేబు చెల్లెలు రోషనారా బేగమ్ పాత్రలో కనిపించనుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.