పుష్ప 2 ఫస్ట్ సింగిల్ సర్ ప్రైజింగ్ అప్ డేట్

surprising update from pushpa 2 movie first single promo

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడోో తెలిసిందే కదా. దీనికి కారణం పుష్ప సినిమా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు బన్నీ. మరోవైపు ఈసినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దానికి తోడు ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుండి ఈమధ్యే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ను వరకూ అన్నీ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాల్లో దూసుకుపోతున్నాయి.

ఇప్పుడు ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ కు సిద్దమయ్యారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఫస్ట్ సింగిల్ ప్రోమోకు సంబంధించిన అప్ డేట్ ఈరోజు 4గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + one =