గత ఏడాది కార్తికేయ2, 18పేజీస్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. వీటిలో కార్తికేయ2 సినిమా అయితే దేశవ్యాప్తంగా మంచి హిట్ ను సొంతం చేసుకొని నిఖిల్ కు పాన్ ఇండియా వైడ్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ ఏడాది అదే జోష్ తో హ్యాట్రిక్ కొడదామని స్పై అనే సినిమాతో రంగంలోకి దిగాడు. ఈసినిమాా జూన్ 9 తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అంచనాలను అందుకోలేదన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈసినిమా మంచి కలెక్షన్స్ నే అందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో ఈసినిమా 28 కోట్లను సొంతం చేసుకొని నిఖిల్ కెరీర్‌లో వేగవంతంగా బ్రేక్ ఈవెన్‌ను పూర్తిచేసిన సినిమాగా ‘స్పై’ నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయకపోవడంపై నిఖిల్ స్పందించాడు. స్పై సినిమా ఆడుతున్న థియేటర్లను ఫుల్ బిజీగా మార్చినందుకు అలానే నా కెరీర్‌లోనే బాక్సాఫీసు వద్ద హయ్యస్ట్ ఓపెనింగ్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు. నా మీద మీ అందరికీ ఎంత నమ్మకం ఉందో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయలేకపోయాం.. కాంట్రాక్ట్ -కంటెంట్ లేట్ అవ్వడం వల్ల ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయలేదు. ఈ విషయంలో హిందీ, కన్నడ, తమిళం, మలయాళం ప్రేక్షకులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. కార్తికేయ2 తరువాత నా మూడు సినిమాలను అన్ని భాషల్లో పక్కాగా పూర్తిచేసి అనుకున్న సమయానికి కచ్చితంగా విడుదల చేస్తామని మాట ఇస్తున్నాను. ఇకపై నాణ్యత విషయంలో అస్సలు రాజీపడకుండా సినిమాలు చేస్తానని.. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి మాట ఇస్తున్నాను అని నిఖిల్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
Straight from the Heart ❤️💔❤️🩹
A Promise from me to Every Cinema Loving Audience… #SpyMovie #Spy pic.twitter.com/SZfV9N4m4G— Nikhil Siddhartha (@actor_Nikhil) July 5, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: