యంగ్ డైరెక్టర్స్ ను ప్రోత్సహించడం లో ముందు వరుసలో వుండే హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇప్పటివరకు తన సినిమాలకు దాదాపు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తూనే వస్తుండగా తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు.ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా తన 21వ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు.ఈసినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయనున్నాడు.అశోక ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి.అశోక ఆర్ట్స్ సంస్థ కు ఇది రెండో సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The FIST of FURY 🔥👊🔥@NANDAMURIKALYAN in an action-packed powerful role ❤️🔥#NKR21 shoot begins soon 🔥#HappyBirthdayNKR @PradeepChalre10 #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @AshokaCOfficial pic.twitter.com/qb9S2TwCee
— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2023
ఇంతకుముందు ఈబ్యానర్ నుండి వచ్చిన అలా ఎలా? సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత రెండో సినిమా కళ్యాణ్ రామ్ తో చేస్తున్నారు.భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈయాక్షన్ ఎంటర్ టైనర్ గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.త్వరలోనే ఈసినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.
ఇదిలావుంటే కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈరోజే ఈసినిమా టీజర్ విడుదలకాగా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంటుంది.బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు.హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈసినిమా ఈఏడాదిలోనే విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: