మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పిన యంగ్ హీరో నిఖిల్

Young Hero Nikhil Superb Words About Mega Power Star Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా జెన్యూన్ పర్సన్ అని అన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. తన తాజా చిత్రం ‘స్పై’ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. చరణ్ యాక్టింగ్ జీనియస్, డ్యాన్సింగ్ జీనియస్, బిజినెస్ మేధావి అని చెప్పాడు. రామ్ చరణ్ నిర్మాతగా ‘వీ మెగా పిక్చర్స్‌’ పతాకంపై తీసే తొలి చిత్రంలో తనను హీరోగా ఎంపిక చేసినందుకు చరణ్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో.. ఆలోచించి వారినే చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారని భావిస్తున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం తన సర్వస్వం ఇస్తానని నిఖిల్ అన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రామ్ చరణ్ ఇటీవల కొత్తగా ‘వీ మెగా పిక్చర్స్‌’ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు, ‘యూవీ క్రియేషన్స్‌’కి చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి ఆయన దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా తమ మొదటి ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’ను నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తన తదుపరి చిత్రం ‘స్పై’ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించనున్నారు. అలాగే మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు. ఇక స్వాతంత్య్ర కాలానికి పూర్వం జరిగే కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా రామ్ వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.