పుష్ప లో కేశవ ఫస్ట్ ఛాయిస్ సుహాస్

pushpa kesava characher first choice suhas says sukumar

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో కూడా చూశాం. బన్నీ నటన, యాక్షన్, సుకుమార్ స్క్రీన్ ప్లే, దేవి మ్యూజిక్ ఇంకా అన్ని అంశాలు కలిసొచ్చి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమాలో కేశవ పాత్ర కూడా ఈసినిమాకు ఎంత కలిసొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కథను మొదటి నుండి చివరకి వరకూ చెప్పడమే కాకుండా, అల్లు అర్జున్ పక్కనే ఉంటూ తన యాసతో, తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈపాత్రకు ఫస్ట్ ఛాయిస్ జగదీష్ కాదంటా. ఈవిషయాన్ని స్వయంగా డైరెక్టర్ సుకుమార్ తెలియచేశారు. సుకుమార్ సుహాస్ హీరోగా నటిస్తున్న ప్రసన్నవదనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్ సుహాస్ గురించి మాట్లాడుతూ సుహాస్ అంటే నాకు, అల్లు అర్జున్ కు కూడా చాలా ఇష్టం. నిజానికి పుష్ప సినిమాలో కేశవ పాత్రకు నేను, బన్నీ నిన్నే అనుకున్నాం. కానీ నువ్వు అప్పటికే హీరోగా చేస్తుండటంతో నిన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడగడం బాగోదు అని ఆగిపోయాము అని తెలిపారు. మరి కేశవ పాత్రలో జగదీష్ అయితే చాలా బాగా చేసి మెప్పించాడు.. మరి సుహాస్ చేసుంటే ఎలాా ఉండేదో..

ఇక సుహాస్ వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ప్రసన్న వదనం. దీనితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు. కేబుల్ రెడ్డి అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలు అన్నీ ఈ ఏడాదే రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.