కెరీర్ మొదట్లో చిన్న పాత్రలు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. మొదటినుండీ కాస్త విభిన్నమైన పాత్రలు చేయడానికే శ్రీవిష్ణు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ప్రస్తుతం అయితే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం. అంతేకాదు మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: