టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా కాంబినేషన్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్-జాన్వీ కపూర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో శ్రీలీల కాంబినేషన్, విజయ్ దేవరకొండ తో శ్రీలీల, మృణాల్ ఠాకూర్.. ఇంకా ఇలా చాలా క్రేజీ కాంబినేషన్స్ వస్తున్నాయి. అలాంటి కాంబినేషనే ఒకటి సెట్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు నాగచైతన్య ఇంకా కీర్తి సురేష్ ది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ప్రస్తుతం జోరుగా వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ముందు అనుపమ పరమేశ్వరన్ పైరు వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా కీర్తిసురేష్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో చైతు పక్కన కీర్తి సురేష్ అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాదు కీర్తిసురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఈ ఇద్దరూ ఇప్పటికే మహానటి సినిమాలో నటించారు. అయితే మహానటి సినిమాలో నాగచైతన్య పాత్ర కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: