కెరీర్ మొదటి నుండీ విభిన్నమైన కథలు, విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీ విష్ణు. సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని చూసుకుంటాడు. అయితే ఒక్కోసారి అవి సక్సెస్ అవ్వొచ్చు.. ఒక్కోసారి కాకపోవచ్చు. అయినా కూడా తన ప్రయోగాలను ఎప్పుడూ ఆపలేదు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఇన్ని రోజులు చిత్రీకరణతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ను బట్టి సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. టీజర్ ను బట్టి హీరో రాఖీలు జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. తన వెంటపడిన అమ్మాయిలతో స్పాట్ లోనే రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. హీరో అలా చేయడానికి కారణం ఏంటనేది సినిమాలో చూడాలి. శ్రీవిష్ణు మరోసారి తన కామెడీతో అలరించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇక లోకల్ మాస్ పార్టీ లీడర్ గా వెన్నెల కిశోర్ పాత్ర కూడా నవ్విస్తుంది. గోపీసుందర్ సంగీతం బాగుంది.
Idhenandi ma Balu gadi vintha problem 😅
Here’s our #Samajavaragamana Teaser :))
– https://t.co/yaZQD1vSnAMande endallo challani navvulatho kaludham 🤗
In theatres from May 18th ❤️@Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @AKentsOfficial @HasyaMovies pic.twitter.com/kps3U1EDiK— Sree Vishnu (@sreevishnuoffl) April 27, 2023
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: