క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్టింగ్ చూపిస్తుండేవాడ సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిజానికి ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా ఆలస్యమవుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా చిత్రయూనిట్ ప్రస్తుతం వరుస అప్ డేట్లను ఇస్తూ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే పాటలను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 26వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
వించిపేట భద్ర, మండే అగ్నిపర్వతం 🪓 ❤️🔥#Krishnamma Theatrical Trailer on April 26th at 4:05 PM 🔥
⭐️ing @ActorSatyaDev
GRAND RELEASE ON 𝐌𝐀𝐘 𝟑𝐑𝐃 💥#VVGopalakrishna @kaalabhairava7 #KoratalaSiva @ArunachalaCOffl @saregamasouth pic.twitter.com/q9Ckg1i3Og
— ArunachalaCOffl (@ArunachalaCOffl) April 24, 2024
ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: